రీ-ఎంట్రీ బ్యాన్‌తో ఇల్లీగల్ వర్కర్లను దేశం నుంచి బహిస్కరించిన ఎల్ఎంఆర్ఎ
- October 04, 2021
బహ్రెయిన్: ఎల్ఎంఆర్ఎ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, తనిఖీల్లో ఉల్లంఘనలకు పాల్పడుతూ దొరికిన కార్మికులకు భవిష్యత్తులో వర్క్ పర్మిట్లు జారీ చేసే ప్రసక్తే లేదని తెలుస్తోంది. దేశం విడిచి వెళ్ళడం తప్ప, వారికి మరో అవకాశం వుండదని డాక్టర్ ఖాలెద్ ముహమ్మద్ అబ్దుల్ రహ్మాన్ చెప్పారు. వారికి దేశంలోకి తిరిగి వచ్చే అవకాశం కూడా ఇవ్వబోమన్నారు. సాసా వీధిలో షాపులపై ప్రధానంగా దృష్టి పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీధి వ్యాపారుల్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. పలు ప్రభుత్వ శాఖలతో కలిసి తనిఖీల చేపడుతున్నారు. నేషనాలిటీ పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్, క్యాపిటల్ పోలీస్ డైరెక్టరేట్, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ మరియు టూరిజం అలాగే మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ విభాగాలతో కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. 17506055 నెంబరుకి ఫోన్ చేసి కూడా ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వవచ్చు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







