బిగ్ టికెట్ డ్రా: 10 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న భారతీయుడు, దొరకని ఆచూకీ
- October 04, 2021
అబుదాబీ: భారత జాతీయుడు నహీల్ నిజాముద్దీన్ 10 మిలియన్ దిర్హాముల్ని బిగ్ టికెట్ అబుదాబీ సిరీస్ 232 డ్రాలో గెలుచుకున్నారు. ఆదివారం ఈ డ్రా జరిగింది. సెప్టెంబర్ 26న నిజాముద్దీన్ 278109 నెంబర్ గల టిక్కెట్ కొనుగోలు చేశారు. కేరళలోని కొల్లాం జిల్లాలో వున్న అడ్రసును నిజాముద్దీన్ ఇచ్చారు. కానీ, ఆ అడ్రస్‌తోపాటు ఇచ్చిన ఫోన్ నెంబర్లు పని చేయడంలేదు. ఓ ఫోన్ ఇన్కమింగ్ పని చేయడంలేదనీ, మరో ఫోన్ రీచ్ అవడంలేదనీ, అతన్ని ఎలాగైనా ట్రేస్ చేస్తామనీ ర్యాఫిల్ నిర్వాహకులు తెలిపారు. మరో వైపు సౌదీ అరేబియాలో నివసిస్తున్న ఇంకో భారతీయ వలసదారుడు ఆంజెలో ఫెర్నాండెజ్ 1 మిలియన్ దిర్హాములను గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







