అమరవీరులకు షార్జా, ఫుజారియాలో అంత్యక్రియలు

- March 17, 2016 , by Maagulf
అమరవీరులకు షార్జా, ఫుజారియాలో అంత్యక్రియలు

ఫైటర్‌ జెట్‌ కూలిన ఘటనలో మృతిచెందిన మొహమ్మద్‌ ఒబైద్‌ సలెమ్‌ అల్‌ హమ్ముది, జాయెద్‌ అలి అల్‌ కాబిల అంత్యక్రియలు జరిగాయి. షార్జాలో మొహమ్మద్‌ ఒబైద్‌ సలెమ్‌ అల్‌ హమ్ముది అంత్యక్రియలు జరుగగా, జాయెద్‌ అలి అల్‌ కాబి అంత్యక్రియలు ఫుజారియాలో నిర్వహించారు. అధికారిక లాంఛనాలతో వీరి అంత్యక్రియలను జరిపారు. ఫుజారియాలో క్రౌన్‌ ప్రిన్స్‌ హమాద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ షర్కి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం జాయెద్‌ అలి అల్‌ కాబి అంత్యక్రియలు నిర్వహించారు. షార్జా డిప్యూటీ రూలర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ సలెమ్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ కాసిమి మరికొందరు ప్రముఖులు మొహమ్మద్‌ ఒబైద్‌ సలెమ్‌ అల్‌ హమ్ముది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com