టిఓఐఎఫ్‌ఎ ఫిలిం అవార్డ్స్ కోసం స్పెషల్ ఆర్‌టిఎ బస్సులు
- March 17, 2016
రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకి ప్రత్యేక బస్సులను నడపనుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిలిం అవార్డ్స్ (టిఓఐఎఫ్‌ఎ) ప్రోగ్రామ్ సందర్భంగా ఈ ఏర్పాట్లను ఆర్‌టిఎ చేసింది. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ మెట్రో స్టేషన్ నుంచి 25 బస్సుల్ని ఇందుకోసం వినియోగించనుంది. డేరా సిటీ సెంటర్, మరీనా మాల్, అల్ ఘుబైబా బస్ స్టేషన్, బుర్ దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. యూఏఈ వ్యాప్తంగా పెద్దయెత్తున టిఓఐఎఫ్‌ఎకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. షారుక్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, రణ్‌వీర్‌సింగ్, రితేష్ దేశ్‌ముఖ్, పరిణీతి చోప్రా తదితరులు రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు. షారుక్, సల్మాన్, కరీనాకపూర్, వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ సహా పలువురు ప్రముఖులు తమ పెర్ఫామెన్స్‌లతో దుబాయ్ వాసుల్ని అలరించనున్నారు. టిఓఐఎఫ్‌ఎ 2016 అవార్డుల కార్యక్రమానికి టిక్కెట్ల ధరలు 199 దిర్హామ్‌ల నుంచి అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







