ఫుడ్ సెక్టార్ లో మళ్లీ పనులు షురూ! వీసాలకు పర్మిషన్
- October 05, 2021
కువైట్: కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గటంతో ఫుడ్ సెక్టార్ లో మళ్లీ పనులు షురూ చేయాలని కువైట్ ప్రభుత్వం భావిస్తోంది. కరోనా ఎమర్జెన్సీ మినిస్ట్రీయల్ కమిటీ సమావేశమై ఫుడ్ సెక్టార్ లో పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. పొలాలు, రెస్టారెంట్స్, బేకరీస్, ఫుడ్ సప్లయ్ కి సంబంధించిన పనుల కోసం వీసాలను అనుమతించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమర్షియల్, వర్కింగ్ వీసాలకు అనుమతించాలని భావిస్తున్నట్లు మినిస్ట్రీయల్ కమిటీ తెలిపింది. ఫుడ్ సప్లయ్ ఫ్యాక్టరీస్, పౌల్ట్రీ, డెయిరీ ప్రొడక్ట్స్, షాపింగ్ సెంటర్స్, వాటర్, అల్కహాల్ తయారీ సంస్థల్లో పనిచేసే వారికి కూడా మళ్లీ వీసాలు మంజూరు చేయనున్నారు. దీంతో చాలా మంది ఇతర దేశాల వారు పనుల కోసం కువైట్ వస్తారు. కరోనా కారణంగా చాలా ఎఫెక్టైన రంగాల్లో ఫుడ్ సెక్టార్ ఒకటి. తాజా నిర్ణయంతో ఫుడ్ సెక్టార్ లో మళ్లీ పుంజుకుంటుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
- ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం..11 మంది మృతి
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!







