కాగ్‌ లో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు

- October 05, 2021 , by Maagulf
కాగ్‌ లో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు

కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(కాగ్‌)కి చెందిన ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగం స్పోర్ట్స్‌ కోటా ద్వారా గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 199

పోస్టులు: ఆడిటర్‌/అకౌంటెంట్‌/క్లర్క్‌/డీఈఓ గ్రేడ్‌-ఏ

క్రీడాంశాలు: క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, హాకీ

అర్హత: ఆడిటర్‌ అండ్‌ అకౌంటెంట్‌ పోస్టులకు బ్యాచిలర్స్‌ డిగ్రీ, క్లర్క్‌/డీఈఓ గ్రేడ్‌ ఏ పోస్టులకు ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు టైపింగ్‌ టెస్ట్‌ ఉంటుంది.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఫీల్డ్‌ ట్రయల్స్‌, సంబంధిత స్పోర్ట్స్‌ సర్టిఫికెట్‌ మార్కులు, ఫిట్‌నెస్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను సంబంధిత నోడల్‌ అధికారుల చిరునామాకు పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 30, 2021

వెబ్‌సైట్‌: https://cag.gov.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com