రజినీకాంత్ 'రోబో' 2 తాజాగా ఢిల్లీ లో షెడ్యూల్..
- March 17, 2016
తెలుగు, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 'రోబో' ఎంతటి ఘనవిజయం సాధించిందో వేరే చెప్పనవసరం లేదు. రజినీ కెరీర్ లో బిగ్గెస్ హిట్,భారీ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2.0 శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్‌గా కనిపించనున్నారు. ఇంటర్నేషనల్ మూవీగా హై స్టాండర్డ్స్‌తో శంకర్ 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కబాలి చిత్రం షూటింగ్ లో ఉన్న రజినీ ఈ చిత్రానికి ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది.మొన్నటి వరకు చెన్నైలోని ఓ భారీ సెట్‌లో ఈ చిత్ర షూటింగ్ జరగగా, తాజాగా ఢిల్లీ షెడ్యూల్ ని జరుపుకోనున్నట్టు మూవీ టీం ప్రకటించింది. అయితే ఢిల్లీలోని జవహరల్ లాల్ నెహ్రూ స్టేడియంలో 2.0 కోసం వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో ఈ చిత్ర షూటింగ్ నెలరోజుల పాటు జరగనుంది. ఇందులో ఓ యాక్షన్ ఎపిసోడ్‌ని చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌లో రజనీతో పాటు అక్షయ్ కుమార్ కూడా పాల్గొననున్నారు. శంకర్- రజినీకాంత్‌ల హ్యట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిర్మిస్తుంది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







