అక్టోబర్ 20 నుంచి రియాద్ సీజన్

- October 09, 2021 , by Maagulf
అక్టోబర్ 20 నుంచి రియాద్ సీజన్

రియాద్: ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాద్ సీజన్ మరో 11 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సీజన్  ద్వాారా  2.9 బిలియన్ల రియాల్స్ కు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు  సౌదీ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ టర్కీ అల్ షేర్ చెప్పారు.  " 2019 సీజన్ ద్వారా ఖర్చులు పోను 2.9 బిలియన్ రియాల్స్ వచ్చాయి. ఈ సారి అంతకుమించి ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాం"  అని ఆయన ట్వీట్ చేశారు. గతేడాది కరోనా కారణంగా రియాద్ సీజన్ ను నిర్వహించలేదు.

వచ్చే ఏడాది మార్చి వరకు రియాద్ సీజన్ ఈ సారి గ్రాండ్ నిర్వహించనున్నట్లు అల్ షేర్ చెప్పారు. అక్టోబర్ 20 న ప్రారంభమయ్యే ఈ సీజన్ వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగనుంది. రియాద్ లోని 14 జిల్లాల పరిధిలో 5.4 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 7500 ఈవెంట్స్, 70 అరబిక్, 6 ఇంటర్నేషనల్ కచేరీలు, 10 ఇంటర్నేషనల్ ప్రొగ్రామ్స్, 350 థియేటర్ ప్రొగ్రామ్స్, అరబిక్ నాటకాలు, ఫ్రీ-రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్, 100 ఇంటరాక్టివ్ సెషన్స్ జరగనున్నాయి. విజిటర్స్ కోసం  200 రెస్టారెంట్లు, 70 కేఫ్‌లు అందుబాటులో ఉంచారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com