పర్సనల్ డిజిటల్ పేమెంట్స్ ఫీజు 40 శాతం తగ్గించిన కెనెట్ (Knet)
- October 09, 2021
కువైట్: డిజిటల్ పేమెంట్స్ ను మరింత ప్రోత్సహించేందుకు ఆటోమేటెడ్ బ్యాకింగ్ సర్వీస్ కంపెనీ "కెనెట్" (Knet) కీలక నిర్ణయం తీసుకుంది. పర్సనల్ డిజిటల్ చెల్లింపుల ఫీజు ను భారీగా తగ్గించింది. ఇప్పటి వరకు 50 ఫిల్స్ గా ఉన్న ఛార్జ్ ను 30 ఫిల్స్ గా మార్చింది. బ్యాంక్ లకు డిజిటల్ చెల్లింపుల భారాన్ని తగ్గించేందుకు కూడా ఈ నిర్ణయం మేలు చేస్తుందని కంపెనీ ప్రకటించింది. పేమెంట్ లింక్ అనే మెసేజ్ లను కెనెట్ సంస్థ కస్టమర్లకు పంపిస్తోంది. ఆ మెసేజ్ లో వచ్చే పేమెంట్ లింక్ ను ఓపెన్ చేసి దాని ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ పేమెంట్స్ పెంచటంలో ఇదో కీలక అడుగని కెనెట్ తెలిపింది.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







