అమరావతి వైభవం - నవ్యాంధ్ర ఆశాకిరణం
- June 06, 2015
2015,జూన్ 6 వ తేది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ దగినరోజు ,ఆంధ్రుల కల నవ్యాంధ్ర రాజధాని భూమి పూజ జరిగిన రోజు ,తెలుగు నేల ,తెలుగు తల్లి పులకించిన రోజు,కృష్ణమ్మ ఆనందంతో ఉప్పొంగిన రోజు ఎందుకంటే
-అమరావతి 2,200 సంవత్సరాల గత వైభవ విశిష్టత కలిగినది .
- కృష్ణమ్మ ఒడిలో అలరారిన ప్రదేశం .
- అమరావతి క్రీ . పూ 2 వ శతాబ్దంలో అశోకుని బౌద్ద స్థూపాలతో ,నాగార్జునకొండ విశిష్టత లతో , బౌద్దమతము ఫరిడవిల్లిన ప్రదేశం
- అమరావతి శిల్పకళ భారతదేశంలోని 3 శిల్పకళలలో ఒకటిగా ప్రసిద్ది చెందినది . మిగిలినవి {గాంధార & మధుర }
- ఇక్కడి అనేక శిల్ప కళా ఖండాలు ఇప్పటికి మద్రాస్ మ్యూజియం లోను ,లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం లోను అమరావతి కళా సంపదగా ప్రత్యేకంగా ప్రదర్శింప బడుతుంది .
- పవిత్రమైన అమరేశ్వర ఆలయం పంచారామాలలో ఒకటిగా భాసిల్లుతున్నది .
- పురాణాల ప్రకారం దేవేంద్రుడి రాజధానిగా అమరావతిని చెపుతారు .
- ఇక్కడి పార్శ్వనాద తీర్ధ ,జైనులకు పరమ పవిత్ర క్షేత్రం .
- క్రీ . పూ 2 వ శతాబ్దంలోధరణికోటను రాజధానిగా చేసుకొని 450 సంవత్సరములు శాతవాహనులు
మహా రాజ్యాన్ని పరిపాలించిన ప్రదేశం .
- ఇక్కడి నుండే మన సంస్కృతి ,సాంప్రదాయాలు ఆగ్నేయ ఆసియా దేశాలకూ విస్తరించాయి {మలేసియా ,ఇండోనేసియా ,ఫిలిప్పేన్స్ ,థాయిలాండ్ మరియు సింగపూర్ }
- తెలుగు భాష ,సంస్కృతి ,సంప్రదాయాల పురిటి గడ్డ ఈ ప్రాంతం .
- పచ్చని వరిపొలాలతో ఆంధ్రుల అన్నపూర్ణగా నిలిచిన ప్రదేశం .
- వాడరేవు మరియు మచిలీపట్నం ఓడరేవులకు సుమారు 100 కి.మి దూరంలో సముద్ర వాణిజ్యానికి అనుకూల ప్రదేశం అమరావతి .
- అమరావతి ఆంధ్రప్రదేశ్ కు మధ్యలో అందరికి అనుకూలముగా ఉన్నది.
- ఇటువైపు 1953లో ఒకప్పటి రాజధాని కర్నూలు ఉన్నప్పటికీ ,అటువైపు అతిపెద్ద నగరం విశాఖపట్నం ఉన్నప్పటికీ ,ప్రజలు విశాల దృక్పధంతో అంగీకరించిన రాజధాని ప్రాంతం అమరవతి.
- వినూత్న పధకంలో భాగంగా భూ సమీకరణ ద్వారా తమ భూములను ,రాజధానికై ధారపోసిన రైతన్నలకు ,అన్నదాతలకు జేజేలు పలుకుతూ పాదాభివందనాలు అర్పిద్దాం .
- హేతుబద్ధం కాని విభజనలో నష్టపోయినప్పటికీ , ఆంధ్రప్రజల దృఢ సంకల్ప నిదర్శనమే సంవత్సరం లోపు నవ్యాంధ్ర రాజధానికి నాంది ,పునాది .
- కారణాలు ఏమైనప్పటికీ ,రాష్ట్రం ఏర్పడిన 60 సంవత్సరాల తరువాత కుడా నిలువనీడ లేక రాజధానిని వెతుక్కుంటున్న ఆంధ్రులలో దైర్యాన్ని నింపుతున్న అమరావతి .
- ఆంధ్రప్రదేశ్ ,అమరావతులు అక్షరాలలోనే కాక అభివృద్ధిలోనూ గణనీయమైన ప్రగతిని సాధించి మన తెలుగు ప్రజల ఆశలు ,ఆకాంక్షలు నెరవేర్చి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిలబడుతుందని ఆకాంక్షిద్దాం .
--ఆర్.వి. రావు & వకుళ దేవి(బహ్రెయిన్)
తాజా వార్తలు
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!







