పార్కింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని ఆదేశించిన ప్రిన్స్

- October 13, 2021 , by Maagulf
పార్కింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని ఆదేశించిన ప్రిన్స్

షార్జా:పబ్లిక్ పార్కింగ్ సేవలను అభివృద్ధి చేయాలని షార్జా యువరాజు, డిప్యూటీ పాలకుడు అండ్ షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) ఛైర్మన్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి అధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో SEC సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. షార్జా ఎమిరేట్‌లో పబ్లిక్ పార్కింగ్ స్థలాల నిర్వహణ, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ నివేదిక గురించి కౌన్సిల్ చర్చించింది. ఎమిరేట్‌లోని నగరాలు, ఇతర ప్రాంతాలలో అందుబాటులో ఉన్న పార్కింగ్ ప్లేస్ ల సంఖ్య, వాటికి ఉన్న డిమాండ్, వాటిని నిర్వహించడానికి ఉన్న యంత్రాంగం వంటి వాటిపై అధికారులు సమర్పించిన నివేదికపై కౌన్సిల్ చర్చించింది. షార్జాలో పార్కింగ్ ఫీజులు, పార్కింగ్ స్థలాల వినియోగం, పర్యాటకులను ఆకర్షించేందుచే చేపట్టాల్సిన అభివృద్ధి పనలపై అధికారులును కౌన్సిల్ అడిగి తెలుసుకుంది. షార్జా ఎమిరేట్‌లో పబ్లిక్ పార్కింగ్ ప్లేస్ సేవలను మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సేవలను అభివృద్ధి చేయాలని కౌన్సిల్ ఆదేశించింది. షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ, ఎమిరేట్స్ టెలికమ్యూనికేషన్స్ గ్రూప్ కంపెనీల మధ్య వ్యూహాత్మక అవగాహన ఒప్పందాన్ని కౌన్సిల్ ఆమోదించింది. రెండు ప్రాంతాల అభివృద్ధిలో ఈ ఒప్పందం దోహదం చేస్తుందని, షార్జాలో చేపట్టే భవిష్యత్తు ప్రాజెక్టులలో ఇది ప్రతిబింబిస్తుందని కౌన్సిల్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com