'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం
- October 13, 2021
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. డ్రామాలు, విమర్శలు, ఆరోపణల మధ్య మంచు విష్ణు ప్యానెల్ మెజారిటీ సాధించింది. ఈ రోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టారు. నరేష్ నుంచి బాధ్యలను తీసుకున్న మంచు విష్ణు ఇకపై ‘మా’ అధ్యక్షుడుగా కొనసాగుతారు. వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, కార్యదర్శిగా రఘుబాబు, కోశాధికారిగా శివబాలాజీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ రోజు ఆఫీసులో తన మొదటి రోజు ఫోటోను పంచుకుంటూ “నేను ఈరోజు ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను! మీ ఆశీస్సులు కావాలి. వీలైనంత వరకు నాకు పాజిటివిటీని పంపండి” అంటూ ట్వీట్ చేశారు. అసోసియేషన్‌లోని కళాకారుల సంక్షేమం కోసం మంచు విష్ణు, అతని ప్యానెల్ సభ్యులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడానికి ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామాలు చేశారు. ప్రెస్ మీట్ సమయంలో ప్రకాష్ రాజ్ బృందం మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు, విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







