ఇన్సర్టబుల్ కార్డియాక్ మానిటర్..
- March 18, 2016
గుండెపోటును ముందుగానే గుర్తించగల పరికరం అందుబాటులోకి వచ్చేసింది. ఇన్సర్టబుల్ కార్డియాక్ మానిటర్, 1.2 సీసీ పరిమాణం కలిగిన ఈ చిన్న పరికరం మూడేళ్లపాటు గుండె స్పందనలను నమోదు చేస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటే దానికి సంబంధించిన సంకేతాలను ముందుగానే అందిస్తుంది. బెంగళూరులోని జయదేవ హృద్రోగ ఆస్పత్రి వైద్యులు దేశంలోనే మొదటిసారిగా 55 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తికి శస్త్రచికిత్స చేసి ఈ పరికరాన్ని అమర్చారు.ఆ విశేషాలను ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఎం.మంజునాథ్, వైద్య నిపుణుడు డాక్టర్ జయప్రకాష్ శంతూర్ శనివారం మీడియాకు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త కాంతిలాల్ తాతేడ్ కొద్ది రోజులుగా అప్పుడప్పుడూ స్పృహ కోల్పోయేవారు. అడపాదడపా ఆయన ఛాతీ నొప్పితో కూడా బాధపడ్డారు. దీనికి సంబంధించి ఆయన పలు చోట్ల వైద్య పరీక్షలు చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. ఈసీజీ, ఎంఆర్ఐ స్కాన చేయించిన తర్వాత డాక్టర్ జయప్రకాష్ శంతర్ను ఆశ్రయించారు. ఆయన కాంతిలాల్ కుటుంబ సభ్యులతో చర్చించి ఈ పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం అందించే సమాచారం ఆధారంగా తదుపరి శస్త్రచికిత్సల కోసం కాంతిలాల్ను సిద్ధం చేస్తామని జయదేవ ఆస్పత్రి హృద్రోగ నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







