నవజాత శిశువుకు అత్యంత అరుదైన చికిత్స చేసిన మెడికవర్‌ హాస్పిటల్స్ వైద్యులు

- October 18, 2021 , by Maagulf
నవజాత శిశువుకు అత్యంత అరుదైన చికిత్స చేసిన మెడికవర్‌ హాస్పిటల్స్ వైద్యులు

హైదరాబాద్: పుట్టుకతోనే కనిపించే అత్యంత సంక్లిష్టమైన వైకల్యాలలో  ఆనోరెక్టల్‌ మాల్‌ఫార్మేషన్స్‌ (ఏఆర్‌ఎం) ఒకటి. మలద్వారం, మూత్రమార్గం  సరిగా ఏర్పడకపోవడం వంటి సమస్యలు  వీటిలో అధికంగా కనిపిస్తుంటాయి. చాలా వరకూ ఏఆర్‌ఎంలు పిండ దశలో యురోరెక్టల్‌ సెప్టమ్‌ యొక్క అసాధారణ అభివృద్ధి ఫలితంగా ఏర్పడతాయి. చాలా సందర్భాలలో మలమార్గం  లేకపోవడం లేదంటే జననేంద్రియాలు మూత్రనాళ మార్గంలో ఫిస్టులాలా ముగియడం కనిపిస్తుంటుంది. ఐదు వేల మందిలో ఒకరికి ఏఆర్‌ఎం సమస్య వచ్చే అవకాశాలున్నాయి. ఈ తరహా అరుదైన ఏఆర్‌ఎం సమస్యతో వచ్చిన పది నెలల బాలునికి మెడికవర్‌ వైద్యులు సంక్లిష్టమైన చికిత్స చేసి నూతన జీవితం  ప్రసాదించారు.

సోమాలియాకు చెందిన 18 నెలల బాలుడికి మలద్వారం లేకపోవడం మరియు మూత్రమార్గం అసాధారణ స్ధితిలో ఉండటం వంటి సమస్యలతో మెడికవర్‌ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు.  ఈ బాలుని స్ధితిని గుర్తించిన సోమాలియాలోని  డాక్టర్లు అప్పటికే రెండుసార్లు శస్త్రచికిత్స చేయడం జరిగింది కానీ బాలుని సమస్యకు  తగిన పరిష్కారం చూపలేకపోయారు. చివరకు బాలుని ప్రాణాలను కాపాడటం కోసమంటూ వారు కొలొస్టమీ చేశారు. ఈ బాలుడిని మెరుగైన చికిత్స కోసం మాదాపూర్‌లోని మెడికవర్‌ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్‌కు తీసుకు వచ్చారు. కన్సల్టెంట్‌  పిడియాట్రిక్ సర్జన్  మధుమోహన్‌ రెడ్డి ఈ బాలుడిని పరిశీలించి ఇంటర్మీడియట్‌ అనోరెక్టల్‌ మాల్‌ఫార్మేషన్‌ స్థితితో ఆ బాలుడు బాధపడుతున్నాడని గుర్తించారు. అంతేకాకుండా పురుషాంగంలో అసాధారణంగా మూత్రనాళం కూడా తెరిచి ఉందని గుర్తించారు.

ఈ బాలుడికి ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం శస్త్రచికిత్స ద్వారా మాత్రమే సాధ్యం. అయితే సాధారణంగా కాకుండా రోగి వెన్నుముక భాగం ద్వారా ఈ చికిత్స చేసి మూత్ర, మల మార్గాలను సరిచేశారు. 

ఈ చికిత్స గురించి డాక్టర్‌  మధుమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘సాధారణంగా శిశువు పుట్టిన వెంటనే ఈ సమస్యలను గుర్తించి తగిన శస్త్రచికిత్స చేయడం ద్వారా వారి ఆరోగ్యం కాపాడటం వీలవుతుంది. ఈ బాలుని స్థితి వైవిధ్యమైనది. పెరినియల్‌ అలా్ట్రసౌండ్‌ సాంకేతికతతో  అతని అవయవ స్థితిని ఖచ్చితంగా అంచనా వేసి  వెన్నుముక భాగం నుంచి శస్త్ర చికిత్స చేయడం జరిగింది.  ఇప్పుడు బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడు’’ అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com