గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- May 13, 2024
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పట్నాలోని గురుద్వారాను సందర్శించారు. సంప్రదాయ సిక్కుల తలపాగా ధరించి ప్రార్థనాలయంలోకి ప్రవేశించారు. 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ నిర్మించిన శ్రీ పట్నా సాహిబ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం గురుద్వారాలోని వంటశాలలోకి ప్రధాని వెళ్లారు. దైవ సేవలో భాగంగా పొయ్యిపై ఉన్న భారీ వంట పాత్రలో తయారవుతున్న పాయసం ప్రసాదాన్ని స్వయంగా గరిటెతో కలియదిప్పారు. ఆ తర్వాత ఓ స్టీల్ బకెట్ లోకి ఆ ప్రసాదాన్ని తీసుకొని భక్తులకు తన చేత్తోనే వడ్డించారు. అంతకుముందు రొట్టెలు కూడా ఒత్తారు. తన దర్శన వివరాలతోపాటు ఫొటోలను మోడీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!