వరుణ్ తేజ్, శ్రీనువైట్ల చిత్రంలో కథానాయిక హెబా

- March 18, 2016 , by Maagulf
వరుణ్ తేజ్, శ్రీనువైట్ల చిత్రంలో కథానాయిక హెబా

మెగా హీరో వరుణ్ తేజ్, శ్రీనువైట్ల, నల్లమలపు బుజ్జి, మిక్కి జే మేయర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. విజయ్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహారించనున్నాడు. ఇలా టెక్నికల్ టీం మొత్తాన్ని సిద్ధం చేసుకున్న దర్శకుడు ఈ చిత్రంలో నటించనున్న కథానాయికలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే లావణ్య త్రిపాఠి పేరు వినిపిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా హెబా పటేల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. 'కుమారి 21 ఎఫ్' సినిమాతో కుర్రకారును కిర్కెక్కించిన హెబాపటేల్ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఆ కోవలోనే తాజాగా వరుణ్ తేజ్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ సరసన ఓ చిత్రంలో అలాగే విష్ణు,రాజ్ తరుణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'ఈడోరకం ఆడోరకం' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.వీటితోపాటుగా బెక్కం వేణుగోపాల్ నిర్మించనున్న 'నేను నా బాయ్ ఫ్రెండ్స్' అనే చిత్రంలోనూ నటించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com