షిర్డీకి విమాన ప్రయాణం కల త్వరలో
- March 18, 2016
ఎంతో కాలంగా సాయి భక్తులు ఎదురు చూస్తున్న షిర్డీకి విమాన ప్రయాణం కల త్వరలో సాకారం అవుతోంది. షిర్డీకి సమీపంలో మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనుంది. రన్‌వే, ట్యాక్సీ వే, టెర్మినల్ నిర్మాణం పూర్తి అయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తోపాటు నీరు, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాల్సి ఉంది.2,500 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్‌వే ఏర్పాటైంది. విమానాశ్రయంలో ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రై వేటు విమానాలకు అనుమతి ఇవ్వనున్నారు. జనవరి నుంచి వాణిజ్య అవసరాలకు ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుందని ఎంఐడీసీ అధికారులు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.ప్రస్తుతం షిర్డీకి రైలు సౌకర్యం కూడా ఉంది. విమానాశ్రయం ప్రారంభమైతే వేలాది మంది భక్తులకు పెద్ద ఊరట లభించనుంది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







