ప్రైవేట్ జెట్ ప్రయాణికుల కోసం కొత్త కొవిడ్-19 ప్రోటోకాల్స్
- October 20, 2021
యూఏఈ: ప్రైవేట్ జెట్ ప్రయాణికుల కోసం ట్రావెల్ ప్రోటోకాల్స్ ను యూఏఈ సివిల్ ఏవియేషన్ అధికారులు సవరించారు. ప్రైవేట్ జెట్ లలో వచ్చే ప్రయాణికులు ఇకపై కొత్త కొవిడ్-19 ప్రోటోకాల్స్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని నేషనల్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు. ప్రైవేట్ జెట్ లలో వచ్చే రెసిడెంట్స్, బిజినెస్ ట్రావెలర్స్, టూరిస్టులు సహా అందరూ తప్పనిసరిగా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICA) లో ‘అరైవల్ రిజిస్ట్రేషన్’లో నమోదు చేసుకోవాలి. ప్రయాణీకులందరూ తప్పనిసరిగా తమ వాలిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ల కాపీని బయలుదేరే పోర్టులో సమర్పించాలి. బయలుదేరడానికి కనీసం 48 గంటల ముందు చేయించుకున్న QR కోడ్‌తో కూడిన నెగిటివ్ PCR సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ప్రయాణీకులు బయలుదేరడానికి ఆరు గంటల ముందు తప్పనిసరిగా రెండో PCR పరీక్ష.. వచ్చిన తర్వాత మూడవ PCR పరీక్ష చేయించుకోవాలి. వచ్చిన ప్రయాణికులందరూ తప్పనిసరిగా వచ్చిన నాల్గవ, ఎనిమిదవ రోజున PCR పరీక్షలు చేయించుకోవాలి. వ్యాపార జెట్లలో ప్రయాణీకుల సంఖ్యను పరిమితం చేసే ప్రోటోకాల్స్ రద్దు చేసినట్టు NCEMA అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







