ప్రైవేట్ జెట్ ప్రయాణికుల కోసం కొత్త కొవిడ్-19 ప్రోటోకాల్స్

- October 20, 2021 , by Maagulf
ప్రైవేట్ జెట్ ప్రయాణికుల కోసం కొత్త కొవిడ్-19 ప్రోటోకాల్స్

యూఏఈ: ప్రైవేట్ జెట్ ప్రయాణికుల కోసం ట్రావెల్ ప్రోటోకాల్స్ ను యూఏఈ సివిల్ ఏవియేషన్ అధికారులు సవరించారు. ప్రైవేట్ జెట్ లలో వచ్చే ప్రయాణికులు ఇకపై కొత్త కొవిడ్-19 ప్రోటోకాల్స్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని  నేషనల్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు. ప్రైవేట్ జెట్ లలో వచ్చే రెసిడెంట్స్, బిజినెస్ ట్రావెలర్స్, టూరిస్టులు సహా అందరూ తప్పనిసరిగా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICA) లో ‘అరైవల్ రిజిస్ట్రేషన్’లో నమోదు చేసుకోవాలి. ప్రయాణీకులందరూ తప్పనిసరిగా తమ వాలిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ల కాపీని బయలుదేరే పోర్టులో సమర్పించాలి. బయలుదేరడానికి కనీసం 48 గంటల ముందు చేయించుకున్న QR కోడ్‌తో కూడిన నెగిటివ్ PCR  సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ప్రయాణీకులు బయలుదేరడానికి ఆరు గంటల ముందు తప్పనిసరిగా రెండో PCR పరీక్ష..  వచ్చిన తర్వాత మూడవ PCR పరీక్ష చేయించుకోవాలి. వచ్చిన ప్రయాణికులందరూ తప్పనిసరిగా వచ్చిన నాల్గవ, ఎనిమిదవ రోజున PCR పరీక్షలు చేయించుకోవాలి. వ్యాపార జెట్‌లలో ప్రయాణీకుల సంఖ్యను పరిమితం చేసే ప్రోటోకాల్స్ రద్దు చేసినట్టు NCEMA అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com