సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యావరణ పునరుద్ధరణకు వాలంటీర్ల కృషి
- October 21, 2021
ఒమన్: షాహీన్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పచ్చదనాన్ని తిరిగి ఏర్పాటు చేసేందుకు వాలంటీర్లు.. పర్యావరణ అథారిటీ సిబ్బందితో కలిసి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా
కొట్టుకుపోయిన లేదా దెబ్బతిన్న చెట్లను తిరిగి పూర్వ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. అక్టోబర్ 20, 21వ తేదీలలో పర్యావరణ పునరుద్ధరణ డ్రైవ్ పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. "తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పచ్చదనాన్ని వాలంటీర్లు, సంబంధిత అధికారులు విస్తృత భాగస్వామ్యంతో తిరిగి తెచ్చేందుకు కృషి చేస్తారు. జీవవైవిధ్యాన్ని సంరక్షించడం, వృక్షసంపదను అభివృద్ధి చేయడం, ఎడారీకరణను తగ్గించడం, దెబ్బతిన్న వృక్షసంపదను పునరుద్ధరించడం లక్ష్యంగా ఈ పర్యావరణ పునరుద్ధరణ డ్రైవ్ సాగనుంది." అని పర్యావరణ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రెండు రోజుల్లో స్వచ్ఛందంగా పనిచేయాలనుకునే వారి కోసం పర్యావరణ అథారిటీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఆసక్తిఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పర్యావరణ పునరుద్ధరణ డ్రైవ్ లో పాల్గొనవచ్చు. ఒమానీ సిదర్ సొసైటీ, ఒమన్ ఎన్విరాన్మెంట్ సొసైటీ, ఉత్తర- దక్షిణ అల్ బాటినాలోని పర్యావరణ విభాగాలు సంయుక్తంగా ఈ భారీ పర్యావరణ పునరుద్ధరణ డ్రైవ్ చేపడుతున్నాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్‌లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







