‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ లో సోనాల్ చౌహాన్

- October 21, 2021 , by Maagulf
‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ లో సోనాల్ చౌహాన్

హైదరాబాద్: వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మోర్ ఫ‌న్ రైడ‌ర్ ‘ఎఫ్3’ షూటింగ్‌ రీస్టార్ట్‌ అయ్యింది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా భారీ వ‌సూళ్ల‌ను సాధించిన ‘ఎఫ్‌2’ చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘దిల్‌’ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కాస్టింగ్ లోకి తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లోనే సోనాల్ చౌహాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ సోనాల్ చౌహాన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. హైద్రాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ సుధీర్ఘ షెడ్యూల్‌ లో ముఖ్య తారాగణం అంతా పాల్గొంటున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ‘ఎఫ్ 3’ కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను రెడీ చేశారు. ప్రేక్షకుల కోసం మ‌రో న‌వ్వుల రైడ్ ను ‘ఎఫ్ 3’ రూపంలో శరవేగంగా రూపొందిస్తున్నారు మేకర్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com