నేవీలో ఉద్యోగాలు..
- October 22, 2021
పదవతరగతి అర్హతతో నేవీలో ఉద్యోగాలు.. జీతం రూ.21,700 నుంచి..Indian Navy 300 Sailor Jobs: ఇండియన్ నేవీ సెయిలర్ రిక్రూట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 300 పోస్టులను భర్తీ చేయనుంది. ఇండియన్ నేవీ ఏప్రిల్ 2022 బ్యాచ్ కోసం అవివాహితులైన పురుష అభ్యర్ధుల నుంచి సెయిలర్ మెట్రిక్ రిక్రూట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్ పాసైన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకుhttp://https://www.joinindiannavy.gov.in/en వెబ్‌సైట్ చూడొచ్చు.
ముఖ్య సమాచారం.. అర్హత్: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 2002 ఏప్రిల్ 01 నుంచి 2005 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి. జీతం: శిక్షణ కాలంలో నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్ధులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. శిక్షణ వ్యవధి: 12 వారాలు కోర్సు ప్రారంభం: ఏప్రిల్ 2022 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులు ప్రారంభం; అక్టోబరు 29, 2021 దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 02,2021 వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/en
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







