ఉమ్రా కంపెనీలపై జరిమానాలను రద్దు
- October 22, 2021
సౌదీ: వీసా నిబంధనలను ఉల్లంఘించారని పలు ఉమ్రా కంపెనీలకు విధించిన జారిమానాలను మక్కాలోని అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ రద్దు చేసింది. జరిమానా విధించే విషయంలో సంబంధిత అధికారులు నిబంధనలు పాటించలేదని ఉమ్రా కంపెనీలు అప్పిల్స్ కోర్టులో అప్పీల్ చేయడంతో ఈ మేరకు జరిమానాలను రద్దు చేస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆరు గంటలు ఆలస్యంగా యాత్రికులు వచ్చారంటూ ఎనిమిది మంది ఉమ్రా ఆపరేటర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించారంటూ సంబంధిత అధికారులు జరిమానాలు విధించారు. యాత్రికులు ఆలస్యంగా రావడం అనేది తమ నియంత్రణలో లేని అంశం అని.. జరిమానా నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ ఆపరేటర్లు.. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. వీసా ఉల్లంఘనకు సంబంధించిన అన్ని నిబంధనలను పరిశీలించిన తర్వాత జరిమానాలను రద్దు చేస్తూ కోర్టు తన తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







