రష్యాలో కుప్పకూలిన దుబాయ్ విమానం 61 మంది దుర్మరణం
- March 19, 2016
దక్షిణ రష్యాలోని రోత్సావ్ ఇన్ డాన్ వద్ద శనివారం ఉదయం దుబాయ్ కు చెందిన ఒక విమానం కూలిపోయింది.ఈ ప్రమాదంలో మొత్తం 61 మంది చనిపోయారు. పెద్ద వర్షం...బలమైన గాలులు వీస్తున్న సమయంలో ల్యాండింగ్ అయ్యే రెండవ ప్రయత్నంలో భూమిని వేగంగా తాకిన ఆ విమానంలో జ్వాలల ఒక్కసారిగా చెలరేగి పెద్ద ప్రేలుడు సంభవించినట్లు స్థానిక అధికారి తెలిపారుదుబాయ్ కు చెందిన బోయింగ్ 737 విమానం భూమికి చేరుకొనే సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి కుప్పకూలింది. విమానంలో 61 మంది ఉన్నారు వీరందరు చనిపోయారని ఆ అధికారి తెలిపారు. ఈ సమాచారం ను రష్యాకు చెందిన టాస్ న్యూస్ ఏజెన్సీ ద్వారా స్థానిక మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధి తెలిపారు. కూలిపోయిన దుబాయ్ విమానంలో మొత్తం 55 మంది ప్రయాణికులు కాగా ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారాని ఆయన తెలిపారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాలకు విమాన ప్రమాదం జరిగినట్లు అత్యవసర మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రష్యా లోని రోత్సావ్ ఇన్ డాన్ మార్గంపై దుబాయ్ బోయింగ్ 737 ఆకాశం నుంచి దిగే సమయంలో నేలను ఒక్కసారిగా బలంగా ఢీ కొట్టింది, దీంతో మంటలు విమానంను చుట్టుముట్టాయి.ఈ మంటలను నియంత్రణకు ఒక గంట సమయం పట్టింది. తొలుత ఈ విమానం రన్వే మీదకు దిగేందుకు ఒక ప్రయత్నం చేసింది...ఆ ప్రయత్నం సాధ్యపడక పోవడంతో మరొక యత్నం చేసింది. ఈ సారి కొన్నివందల మీటర్ల (గజాలు) నుండి నేరుగా భూమిని తాకిందని రష్యన్ వార్తా ఛానల్ లైఫ్ న్యూస్ నివేదించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







