హైదరాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బ్యాట్ ఆవిష్కరణ!

- October 24, 2021 , by Maagulf
హైదరాబాద్లో ప్రపంచంలోనే  అతిపెద్ద క్రికెట్ బ్యాట్ ఆవిష్కరణ!

హైదరాబాద్: పెర్నోడ్ రికార్డ్ ఇండియా (ప్రై) లిమిటెడ్ రూపొందించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ను పొందిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బ్యాట్ను తెలంగాణ ప్రభుత్వం, ఎమ్ఎ & యూడి ముఖ్య కార్యదర్శి మరియు ఐ & పిఆర్, కమీషనర్,అరవింద్ కుమార్, ఐఎఎస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్ సందర్బాన్ని పురస్కరించుకుని నేడు ట్యాంక్ బండ్ వద్ద ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం, ఐ & సి మరియు ఐటి, ముఖ్య కార్యదర్శి,జయేశ్ రంజన్ మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అధ్యక్షుడు, మహమ్మద్ అజహరుద్దీన్లు హాజరైనారు. ఈ కార్యక్రమంలో ఉదిత్ దుగర్, జోనల్ హెడ్, సౌత్ ఇండియా, పెర్నోడ్ రికార్డ్ ఇండియా (ప్రై) లిమిటెడ్, గోపాల్ అకోట్కర్, రీజినల్ హెడ్, తెలంగాణ & ఎపి, పెర్నోడ్ రికార్డ్ ఇండియా (ప్రై) లిమిటెడ్లు కూడా పాల్గొన్నారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బ్యాట్గా ఉన్న దీనిని 56.1 అడుగుల పొడవుతో, పోప్లర్ వుడ్తో తయారు చేయబడింది మరియు దీని బరువు సుమారు 9 టన్నులు ఉంటుంది. బిఎస్ఎల్ ఈవెంట్ దీనిని తయారు చేయగా, నిర్మించడానికి దాదాపు ఒక నెల సమయం పట్టింది. ఐసిసి పురుషుల టి-20 ప్రపంచ కప్లో పాల్గొంటున్న భారత టి-20 క్రికెట్ జట్టుకు సీగ్రామ్స్ రాయల్ స్టాగ్ బాటిల్డ్ వాటర్ ఈ బ్యాట్ను అంకితం చేస్తోంది. పెర్నోడ్ రికార్డ్ ఇండియా (ప్రై) లిమిటెడ్ తరపున  ఉదిత్ దుగర్ మరియు గోపాల్ అకోట్కర్లు తెలంగాణ ప్రభుత్వానికి ఈ బ్యాట్ను అధికారికంగా అందజేశారు. ఈ బ్యాట్ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ రోడ్డులో, క్రికెట్ అభిమానులు భారత టీ 20 జట్టుకు తమ మద్దతు తెలపడం కోసం, ప్రజల సందర్శన కోసం మరియు వారిలో ఒక టెంపోను పెంచేందుకు దీనిని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ...ఈ ప్రపంచంలోని అతి పెద్ద బ్యాట్ మరియు ఇండియా - పాకిస్తాన్ మధ్య జరగబోతున్న మ్యాచ్ కారణంగా, రేపే మనం దీపావళి వేడుకలు జరుపుకోనున్నట్లు తెలిపారు. కన్నుల పండుగగా ఉన్న ఈ బ్యాట్ను ఆస్వాదించడానికి సండే ఫండేకి వచ్చే ప్రజల కోసం మేము ట్యాంక్బండ్పై బ్యాట్ను ప్రదర్శన కోసం ఏర్పాటు చేస్తున్నాము. ఆ తర్వాత ఈ బ్యాట్ను ఉప్పల్ స్టేడియంలో ఉంచాలని మేము అజార్ భాయ్ని అభ్యర్థించాము. హైదరాబాద్కి ఈ బ్యాట్ ఒక గర్వించదగ్గ విషయం, ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్ ఇక్కడ ప్రదర్శించబడుతోంది. దీనిని ప్రదర్శించడానికి హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసుకున్నందుకు నేను పెర్నోడ్ రికార్డ్ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
జయేశ్ రంజన్ మాట్లాడుతూ, ఈ సందర్భంగా నేను పెర్నోడ్ రికార్డ్ని అభినందిస్తున్నాను, ఎందుకంటే, ప్రపంచ రికార్డు ఉన్న ఈ అరుదైన బ్యాట్ను వారు భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఉంచవచ్చు, కానీ వారు హైదరాబాద్నే ఎంచుకున్నారు, ఇది చాలా గర్వించదగ్గ విషయం. రికార్డ్ సృష్టించిన ఈ బ్యాట్ హైదరాబాద్లో శాశ్వతంగా ప్రదర్శించబడుతుంది మరియు అది ఒక  గొప్ప గౌరవం కూడా. టి-20 వరల్డ్ కప్ నేటి నుండి యూఎఇ లో ప్రారంభమవుతుంది, రేపు భారతదేశం తన మొదటి మ్యాచ్ ఆడాల్సి ఉన్నది. మన జట్టు ఫామ్, వారు ఆడిన క్రికెట్ మరియు వార్మప్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్లపై వారు సాధించిన విజయాలు చూస్తుంటే, వారు అదే ఫామ్ని కొనసాగించి మరియు నవంబర్ 14న వరల్డ్ కప్లో ఫైనల్స్ రోజును మనం ఘనంగా జరుపుకుంటాం అని భావిస్తున్నాను. భారత్కు కప్ వస్తుందన్న నమ్మకం ఉంది. భారత్ జట్టు గ్రూప్ ‘బి’లో ఉంది, ఆ గ్రూప్లో పాకిస్థాన్ మరియు న్యూజిలాండ్లు మాత్రమే బలమైన జట్లు, ఇతర జట్లకు భారత్తో తలపడేంత సామర్థ్యం లేదు. ఒక రకంగా చెప్పాలంటే టోర్నీ ప్రారంభ దశలో రెండు బలమైన జట్లతో ఆడే భారత్కు ఇది ఒక సువర్ణావకాశం. మనం పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్లను ఓడించగలిగితే, మనం సెమీ-ఫైనల్స్కు సులభంగా చేరుకోగలుగుతాము, ప్రస్తుత భారత జట్టు ఫామ్ చూస్తుంటే, భారతదేశం  పైచేయి సాధిస్తుందని నేను చెప్పగలను, వారి అద్భుతమైన ఫామ్ మరియు గత సంవత్సరం ఆస్ట్రేలియా మరియు ఈ సంవత్సరం ఇంగ్లండ్లో సాధించిన విజయాలు ఇంకా తాజాగా ఉన్నాయి, ఐపీఎల్లో కూడా మన ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ని ప్రదర్శించారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్లు భీకర ఫామ్లో ఉన్నారు, అదే ఫామ్ను కనుక కొనసాగించినట్లయితే పాకిస్థాన్పై అద్భుత విజయాన్ని నమోదు చేయవచ్చు. నేను గత మూడు దశాబ్దాలుగా భారత్  - పాకిస్తాన్ మ్యాచ్లను మిస్ కాకుండా చూస్తున్నాను, ఈ మ్యాచ్లు ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకమైనవి, రెండు జట్లు తమ అత్యుత్తమ ఆటగాళ్లను కలిగి ఉంటాయి, అత్యుత్సాహంతో మ్యాచ్ను గెలవడానికి ప్రయత్నిస్తాయి, కానీ ప్రస్తుత ఫామ్ని కనుక పరిగణనలోకి తీసుకుంటే మనం కూడా వాస్తవంగా ఉండాలి, ఆ జట్టులో కూడా బాబర్ అజామ్, షహీన్ అఫ్రిది, యాసీర్ షా వంటి కొంతమంది మంచి ఆటగాళ్లు ఉన్నారు, కానీ భారత ఆటగాళ్లు వారికంటే మెరుగైన ఫామ్ను కలిగి ఉన్నారు మరియు మొత్తం ప్రపంచ కప్కు మరీ ప్రత్యేకించి పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ కోసం భారత జట్టుకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

మహమ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ, 9000 కిలోల బరువున్న ఈ బ్యాట్ను తయారు చేసినందుకు పెర్నోడ్ రికార్డ్ను అభినందిస్తున్నాను, ఈ బ్యాట్ బరువు గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఒక హైదరాబాదీగా, ఈ ఐకానిక్ బ్యాట్ను హైదరాబాద్లోనే తయారు చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. దీనిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ధృవీకరించబడినందున మరింత ఆనందంగా ఉన్నది. ఈ చారిత్రాత్మిక బ్యాట్ను రూపొందించడానికి మీరు వెచ్చించిన సమయం, కృషి మరియు ప్రణాళికలకు మీరు రివార్డ్కు అర్హులు. టి-20 వరల్డ్ కప్లో రేపు పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టుకు నా హృదయపూర్వక శుభాభినందనలు మరియు  ఇది ఒక గొప్ప హోరాహోరీ పోరు అవుతుంది మరియు భారతదేశం అద్బుత విజయం సాధిస్తుంది. బ్యాట్ను ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేయాల్సిందిగా నేను జయేశ్ రంజన్ సార్ మరియు అరవింద్ సార్ని అభ్యర్థిస్తున్నాను, దీనిని అక్కడ ఉంచితే చాలా సంతోషిస్తాను, క్రికెట్ మైదానంలో ఇదొక ఒక ల్యాండ్మార్క్ అవుతుంది.

ఐసిసి పురుషుల టి-20 ప్రపంచ కప్లో పాల్గొంటున్న భారత టి-20 క్రికెట్ జట్టుకు ప్రజల్లో మరింత మద్దతును పెంచేందుకు మా వంతుగా మేము  దీనిని ఏర్పాటు చేశాము. పూర్తి ఫామ్లో ఉన్నంటువంటి భారత జట్టు దేశానికి టి-20 కప్ను తీసుకురావడంలో అదృష్టాన్ని అందించేదిగా ఇది పనిచేస్తుందని,  క్రికెట్తో రాయల్ స్టాగ్ చిరకాల అనుబంధం కలిగి ఉన్నది, వాస్తవానికి మేము క్రికెట్తో ఇరవై సంవత్సరాలకు పైగా అనుబంధం కలిగి ఉన్నాము, మేము విదేశాలకు చెందిన కొంతమంది దిగ్గజ క్రికెటర్లతో పాటు భారతదేశంలోని అత్యుత్తమ క్రికెటర్లతో కలిసి పని చేస్తున్నాము. మేము కూడా ఐసిసితో రెండు దశాబ్దాలకు పైగా  అతి పెద్ద మరియు గర్వించదగిన భాగస్వామ్యాన్ని కలిగివున్నాము. ఐసిసి టి-20 ప్రపంచ కప్ జరుగుతున్నందున, మాదైన స్వంత మార్గంలో మన జట్టును ప్రోత్సహించాలని మరియు మన భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలపాలని కోరుకున్నాము. ‘లివింగ్ ఎట్ లార్జ్’ అనే మా తత్వానికి అనుగుణంగా, మేము చాలా పెద్దది చేయాలనుకున్నాము మరియు తెలంగాణ ప్రజల కోసం నేను ఈ బ్యాట్ను అందజేయడం చాలా సంతోషంగా, గర్వంగా ఉండడంతో పాటు  దీనిని అందించినందుకు గర్విస్తున్నాను నగరం నడిబొడ్డులో ఏర్పాటు చేసిన 56.1 అడుగుల పొడవైన ఈ బ్యాట్  ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ద్వారా సర్టిఫికేట్ పొందింది, అందుకు ఎంతో గర్విస్తున్నాము. అభిమానులందరూ దీనిని చూడటానికి రావాలని మరియు భారత జట్టుకు మీ శుభాకాంక్షలు తెలియజేయాలని నేను కోరుతున్నాను, తద్వారా ప్రపంచ కప్ను స్వదేశానికి తిరిగి తీసుకురావాలని మేము వారిని ఉత్సాహపరుస్తున్నాము, ఎందుకంటే మనం దానిని గెలవడానికి సంసిద్ధంగా ఉన్నామని, పెర్నోడ్ రికార్డ్ ఇండియా (ప్రై) లిమిటెడ్, జోనల్ హెడ్, సౌత్ ఇండియా, శ్రీ ఉదిత్ దుగర్ అన్నారు.

పెర్నోడ్ రికార్డ్ ఇండియా (ప్రై) లిమిటెడ్, మార్కెటింగ్ హెడ్, సౌత్ ఇండియా, రితేష్ మిగ్లానీ మాట్లాడుతూ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ద్వారా ధృవీకరించబడిన ప్రపంచంలోనే ఈ అతిపెద్ద క్రికెట్ బ్యాట్ను తెలంగాణ ప్రజలకు అంకితం చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలోనే ఇది అతి పెద్దది, ఏ ఒక్క రాత్రిపూటలో దీనిని పూర్తి చేయలేదు, రెండేళ్ల ఈ ఆలోచన పురుడు పోసుకుంది, 56.1 అడుగుల పొడవైన ఈ బ్యాట్తో, 2019 జూన్లో ఏర్పాటు చేసిన 51 అడుగుల ప్రస్తుతం కొనసాగుతున్న రికార్డును మేము అధిగమించినట్లయ్యింది, ఈ బ్యాట్ బరువు 9000 కిలోలు ఉన్నది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com