మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- December 30, 2025
హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్కు తొలి కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి.అనంతరం నేరడ్మేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ శాఖ పనితీరు, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారిస్తామని తెలిపారు.
కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రించడం, ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడం, మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, సమస్యలను వేగంగా పరిష్కరించేలా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని పని చేస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







