ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి దాడి నలుగురి మృతి

- March 19, 2016 , by Maagulf
ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి దాడి నలుగురి మృతి

టర్కీలోని ఇస్తాంబుల్‌ నగరంలోప్రభుత్వ భవన సముదాయాలు ఉన్న ఇస్టిక్‌లాల్‌ వీధిలోని రద్దీ వ్యాపార సముదాయం వద్ద శనివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో కనీసం నలుగురు మరణించగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. ఇది కుర్దిష్‌ తీవ్ర వాదుల పనేనని టర్కీ ప్రభుత్వం ఆరోపించింది. స్థానిక కాలమానం ప్రకారం 11గంటల సమయంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దీంతో నగరంలో హై అలర్ట్‌ ప్రకటించారు. తర్వాత ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గాయపడిన వారిలో కొందరు ఇజ్రాయిలీలు, ఇద్దరు ఐరిష్‌ జాతీయులు, జర్మనీ, ఐస్‌లాండ్‌, దుబాయ్‌, ఇరాన్‌లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.
దీనిపై టర్కీ అధ్యక్షులు ఎర్డగాన్‌ మాట్లాడుతూ.. ''టర్కీ దళాల ఓటమి చవిచూసిన ఉగ్రవాదులు అసహనంతో సామాన్యులపై దాడులకు దిగుతున్నాయి'' అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com