పాక్ పై భారత్ విజయభేరి
- March 19, 2016
టి20 వల్డ్ కప్ పోటీల్లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 119 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. కోహ్లీ 55, యువరాజ్ 24 పరుగులు, ధోనీ 13 పరుగులు, రోహిత్ శర్మ 10 పరుగులు, శిఖర్ ధావన్ ఆరు పరుగులు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. షర్జీల్ ఖాన్ 17, అహ్మద్ షెహజాద్ 25 పరుగులు, ఆఫ్రిదీ 8, అక్మల్ 22, షోయబ్ మాలిక్ 26 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నెహ్రా, బుమ్రా, రైనా, జడేజా, పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. పాక్ బౌలర్లలో సమీ రెండు వికెట్లు తీశాడు. అమీర్, రియాజ్ చెరొక వికెట్ సాధించారు. 37 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 55 పరుగులు చేసిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
తాజా వార్తలు
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్మూన్..!!







