ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన నలుగురు అరెస్ట్

- November 02, 2021 , by Maagulf
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన నలుగురు అరెస్ట్

షార్జా: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రాష్ డ్రైవింగ్ చేసిన నలుగురు వ్యక్తులను షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ ను కన్ ఫ్యూజ్ చేస్తూ ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసినందుకు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనులకు సంబంధించిన సమాచారం అందటంతో పోలీసులు వారిని వెంబడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పక్కాగా వారి లోకేషన్ గుర్తించారు. ఐతే నిందితులు  తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులను ఇబ్బంది పెట్టారు. మొత్తానికి ఛేజ్ చేసిన నలుగురిని పట్టుకున్నారు. వారిపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులు పెట్టారు. ప్రజలంతా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com