ఇప్పట్లో వ్యాట్ తగ్గించే ఆలోచన లేదు
- November 02, 2021
సౌదీ అరేబియా: వ్యాట్ రేటు తగ్గించవచ్చని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సౌదీ అరేబియా ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇప్పట్లో అలాంటి ఆలోచన ఏదీ లేదన్నారు. గతేడాది కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. ఈ కారణంగా సౌదీ ప్రభుత్వం 5 శాతంగా ఉన్న వ్యాట్ రేటు 15 శాతానికి పెంచింది. ఐతే కరోనా ప్రభావం తగ్గి ప్రస్తుతానికి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మళ్లీ వ్యాట్ రేటును 5 శాతానికి తగ్గించవచ్చని వార్తలు జోరందుకున్నాయి. దీంతో ఆర్థిక శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. మరో ఐదేళ్ల పాటు రేటు తగ్గించకపోవచ్చని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్టేబుల్ అయిన తర్వాత రేట్లు తగ్గించాలా? వద్దా ?అన్నది నిర్ణయిస్తామని చెప్పారు. కానీ ఇప్పట్లో మాత్రం వ్యాట్ తగ్గించే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. దీంతో వ్యాట్ తగ్గుతుందని ఆశించిన జనాలకు నిరాశే మిగిలింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







