కమ్ముకున్న పొగమంచు...వాహనదారులు అలర్ట్ గా ఉండాలన్న అధికారులు
- November 05, 2021
యూఏఈ: దుబాయ్, అబుధాబి లలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది. శుక్రవారం తెల్లవారుజామున 1 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య యూఏఈలోని పలుచోట్ల దట్టమైన పొగమంచు ఉంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (NCM) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ వరుస ట్వీట్‌లలో తెలిపింది. ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ బోర్డులపై ప్రదర్శించబడే స్పీడ్ లిమిట్స్ పాటించాలని అబుదాబి పోలీసులు ట్వీట్ చేశారు. పొగమంచు ఉన్న ఏరియాల్లో వాహనదారులు సురక్షితంగా నడపాలని, వాహనదారులు వాహనాల మధ్య దూరం పాటించాలని షార్జా పోలీసులు వాహనదారులను కోరారు. దుబాయ్, అబుదాబిలలో గాలిలో తేమ శాతం 90 నుండి 95 శాతానికి చేరుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు, దుబాయ్, అబుదాబిలలో ఉష్ణోగ్రతలు తగ్గుతూనే ఉన్నాయని.. అల్ క్వాలో 20 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!