ప్లేటుతో బాయ్‌ఫ్రెండుని చంపిన కేసులో నిందితురాలికి ఊరట

- November 05, 2021 , by Maagulf
ప్లేటుతో బాయ్‌ఫ్రెండుని చంపిన కేసులో నిందితురాలికి ఊరట

బహ్రెయిన్: ఓ మహిళ, ఓ వ్యక్తిపై ప్లేటుతో దాడి చేయడంతో, ఆ వ్యక్తి మృతి చెందాడు. అయితే, ఈ కేసులో నిందితురాలిపై మోపబడిన హత్య కేసు నుంచి ఆమెకు న్యాయస్థానం ఊరట కల్పించింది. బాధితుడ్ని నిందితురాలు ప్లేటుతో కొట్టిన మాట వాస్తవమే అయినా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా మాత్రమే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయపడ్డ ఆ వ్యక్తిని నిందితురాలు ఆసుపత్రికి తరలించడం జరిగింది. మృతుడు తనకు స్పాన్సర్ అనీ, అనుకోకుండా జరిగిన ఘటన అనీ ఆమె న్యాయస్థానం యెదుట వాదనలు వినిపించింది. అంతకు ముందు ఆ మహిళపై ఎలాంటి నేర చరిత్రకు సంబంధించిన ఆధారాలు లేకపోవడం, అనుకోకుండా జరిగిన ఘటన అని విచారణ సందర్భంగా నిర్ధారణకు రావడంతో, హత్య కేసు నుంచి ఆమెకు ఊరటనిచ్చింది న్యాయస్థానం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com