ప్రపంచంలోనే అతి పొడవైన విమానం
- March 20, 2016
ప్రపంచంలోనే అతి పొడవైన విమానం కొత్త ఫొటోలను ఆదివారం విడుదల చేశారు. ఎయిర్‌లాండర్ 10 అనే ఈ విమానాన్ని బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో సోమవారం ఆవిష్కరించనున్నారు. త్వరలో ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నారు. 92 మీటర్ల పొడవుతో ఉండే ఈ విమానం అతిపెద్ద ప్యాసింజర్ జెట్‌ల కన్నా 15 మీటర్లు ఎక్కువ పొడవుగా ఉంటుంది. బ్రిటన్‌కు చెందిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్(హెచ్‌ఏవీ) రూపొందించిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 3 వారాలపాటు విహరించడానికి అవసరమైన హీలియం ఇంధనాన్ని నింపుకోవచ్చు. 26 మీటర్ల ఎత్తు, 44 మీటర్ల వెడల్పుతో ఉంటుంది.గాలి కన్నా బరువుగా ఉండే ఎయిర్‌లాండర్ వివిధ రకాల ఉపరితలాలైన నీరు, మంచుపైనా ల్యాండ్ అవుతుందని స్కై న్యూస్ పేర్కొంది. 2009లో దీన్ని మొదటిసారి అమెరికా కోసం తయారుచేశారు. నిఘా, కమ్యూనికేషన్స్, కార్గో, సహాయక సామగ్రి పంపిణీతోపాటు ప్రయాణికుల రవాణకూ ఇది అనువుగా ఉంటుందని హెచ్‌ఏవీ చెప్పింది. 50 టన్నుల బరువును తీసుకెళ్లే సామర్థ్యం ఉందని తెలిపింది. 92 ఎంపీహెచ్ వేగంతో నడిచే వెస్సెల్ ఉందని, ఇది కాలుష్యాన్ని విడుదల చేయదని పేర్కొంది 2018 నాటికల్లా 12 ఎయిర్‌లాండర్‌లను తయారుచేసే అవకాశముంది. ఇందులో 48 మంది ప్రయాణికులు వెళ్లొచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







