రికార్డు స్థాయికి చేరుకొన్న బహ్రెయిన్ ప్రజా రవాణా వినియోగదారుల సంఖ్య
- March 20, 2016
ఈ నెల మార్చి 4 వ తేదీన బహ్రెయిన్ ప్రజా రవాణా వినియోగదారులు ఒక రికార్డును నమోదు చేశారు. ఆ ఒక్క రోజునే 52,000 మంది ప్రయాణికులు తమ బస్సుల ద్వారా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోన్నారని ఇది ఎంతో అరుదైన విషయమని రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ (ఎంటిటి) సహాయ కార్యదర్శి మరియం అహ్మద్ జుమాన్ పేర్కొన్నారు. ఈ రికార్డు ద్వారా ప్రజలకు ప్రబుత్వ బస్సు సేవలకు పెరుగుతున్న గిరాకీ బహ్రెయిన్ ప్రజా రవాణా సంస్థను ( బహరేన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ) ఉపయోగించుకోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. గత ఫిబ్రవరిలో 30,628 ప్రయాణికులు తమ యొక్క సేవలను పొందినట్లు తెలిపారు. కొత్త ప్రజా రవాణా సేవ యొక్క ప్రయోగం తర్వాత నుండి, ప్రయాణ వినియోగదారులు సంఖ్య ఎనిమిది మిలియన్లకు పైగా చేరుకుంది.
మనామా బస్సు టెర్మినల్ నుండి ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 10:30 వరకు నడుస్తున్న 32 బస్సు మార్గాలలో 17 మార్గాలు మనామా సెంటర్ మార్గాలను కలుపుతూ అత్యంత రద్దీగా ప్రయాణిస్తున్నట్లు ఆమె చెప్పారు. క్రొత్త స్మార్టుకార్డ్ సేవ సైతం ప్రయాణికులను రోజువారీ బస్సులు ఉపయోగించడానికి ఓ ముఖ్య కారణమని తెలిపారు. ప్రయాణికులకు ఇది ఎంతో సౌలభ్యంగా ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







