బహుమతులు గెలిచారంటూ సైబర్ మోసాలు..
- November 06, 2021
ఒమన్: కొత్త పద్ధతి సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. OTP వెరిఫికేషన్ కోడ్‌ను నేరస్థులు ఉపయోగించుకుని సైబర్ మోసాలకు పాల్పడే కొత్త రకం సైబర్ మోసాన్ని గుర్తించామన్నారు. "సైబర్ నేరగాళ్లు బాధితులకు ఫోన్ చేసి.. ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రం నుండి బహుమతిని గెలుచుకున్నారని, మీ ఫోన్ కు వచ్చే OTP చెబితే బహుమతి మీదవుతుందని నమ్మబలుకుతారు. ఆ తర్వాత OTP చెప్పగానే ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేస్తారు.’’ అని రాయల్ ఒమన్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. అందుకే అలాంటి ఫోన్ కాల్స్ లకు స్పందించవద్దని, OTP ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని రాయల్ ఒమన్ పోలీసులు సూచించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







