ఫైజర్ టాబ్లెట్ తో కరోనా నుంచి 90 శాతం రక్షణ

- November 06, 2021 , by Maagulf
ఫైజర్ టాబ్లెట్ తో కరోనా నుంచి 90 శాతం రక్షణ

కరోనా మహమ్మరి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో తెలిసిందే. ఈ మహమ్మరి నివారణకు ఇప్పటికీ కూడా ఎలాంటి మందు లేదు. కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకే వ్యాక్సిన్లు, ట్రీట్ మెంట్లు చేస్తున్నారు. కానీ ఇది పూర్తిస్థాయిలో రక్షణ ఇవ్వటం లేదు. కరోనా విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న తరుణంలో ఫైజర్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. తమ కంపెనీ కొత్తగా తేనున్న యాంటీ వైరల్ టాబ్లెట్ కరోనా నుంచి దాదాపు 90 శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపింది.హాస్పిటలైజేషన్ గానీ డెత్ రేటు ను గానీ ఫైజర్ తేనున్న టాబ్లెట్ తో 90 శాతం తగ్గించవచ్చని సంస్థ గట్టిగా చెబుతోంది.ఇప్పటికీ కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ కోసం ఐవీ ప్లూయిడ్స్, ఇంజక్షన్స్ ఇస్తున్నారు.కానీ ఫైజర్ తేనున్న టాబ్లెట్ తో ఎలాంటి ఇంజెక్షన్స్ అవసరం లేకుండానే కరోనా నుంచి విముక్తి పొందవచ్చంట. ఐతే ఈ టాబ్లెట్ మార్కెట్ లోకి రావటానికి కాస్త టైమ్ పట్టనుంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు అనుమతుల కోసం కంపెనీ అప్లయ్ చేసింది. వారి నుంచి అనుమతి వస్తే ఈ టాబ్లెట్ మార్కెట్ లోకి వస్తుంది. పాక్స్ లోవిడ్ పేరుతో కొత్త టాబ్లెట్ ను మార్కెట్ లోకి తెస్తామని ఫైజర్ సంస్థ ప్రకటించింది.దీంతో ఈ టాబ్లెట్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com