టూరిస్ట్ ల కోసం ఉచిత బస్ సర్వీసులు
- November 06, 2021
అబుధాబి: అబుధాబి సందర్శించే ఇంటర్నేషనల్, లోకల్ టూరిస్ట్ లకు టూరిజం డిపార్ట్ మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక్కడకు వచ్చే టూరిస్టులందరికీ ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోకి టూరిస్ట్ లను మరింత అట్రాక్ట్ చేయటంతో పాటు విజిటర్స్ వీలైనన్నీ ఎక్కువ ప్రాంతాలను చూసే విధంగా వారికి ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇస్తున్నట్లు తెలిపింది.ఈ బస్ సౌకర్యం కారణంగా అబుధాబిలోని చాలా ప్రాంతాలను టూరిస్టులు రవాణా ఖర్చు లేకుండానే చూడవచ్చు. ఏసీ, వై ఫై సౌకర్యం ఉన్న 11 బస్సులను ఫ్రీ నడుపుతున్నారు. రెండు రూట్లలో ఈ బస్సులు నడుస్తాయి.మొత్తం 18 స్టాప్స్ ను కవర్ చేస్తాయి. బస్సులు షటిల్ సర్వీసులు అందిస్తున్నాయి. కనుక విజిటర్స్ ఏ ప్రాంతానికి వెళ్లిన తిరిగి మళ్లీ వాళ్లుండే హోటల్ కు గానీ బస చేసిన ప్రాంతానికి గానీ ఫ్రీ బస్సుల ద్వారానే చేరుకోవచ్చు.ఈ రెండు రూట్లలో చాలా ప్రాంతాలు కవర్ కానున్నాయి. 9 హోటళ్లు, 9 రిసార్టులు, రెండు ఎక్స్ పో లను కవర్ ఒక రూట్ బస్సులో కవర్ చేస్తుండగా..మరొ రూట్ బస్ లో యస్ ఐలాండ్, జుబాలీ ఐస్ లాండ్, సాదియత్ ఐస్ లాండ్,అబుధాబి టౌన్ టౌన్ సెంటర్, గ్రాండ్ కెనాల్ ప్లేస్ లు కవరవుతాయి.అబుధాబి ఆన్ లైన్ బుకింగ్ ఫ్లాట్ ఫాం పై టికెట్లు బుక్ చేసుకున్న టూరిస్టులకు QR కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఆధారంగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని వాడుకోవచ్చు.
--వై.నవీన్, మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!