కరోనా కట్టడిలో బహ్రెయిన్ బెస్ట్.. రికవరీ ఇండెక్స్ లో టాప్ ప్లేస్
- November 07, 2021
బహ్రెయిన్: COVID-19 ని అరికట్టడంలో విజయవంతమైన ప్రపంచదేశాల సరసన బహ్రెయిన్ నిలిచింది. COVID-19 రికవరీ ఇండెక్స్ లో టాప్ దేశాల్లో బహ్రెయిన్ చోటు దక్కించుకుంది. బహ్రెయిన్ తీసుకున్న కరోనా కట్టడి చర్యలతో మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట పడటంతోపాటు సాధారణ జీవన విధానాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చాయి. అక్టోబర్‌లో నిక్కీ విడుదల చేసిన COVID-19 రికవరీ ఇండెక్స్ లో బహ్రెయిన్ ప్రపంచంలోని అగ్ర దేశాలలో ఒకటిగా నిలిచింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (74%), చిలీ (73%), మాల్టా (70.5%), సౌదీ అరేబియా (70%) తర్వాత స్థానంలో బహ్రెయిన్ (70%) నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో జపాన్, కొలంబియా (69%)తో నిలిచాయి. నవంబర్ 1న, 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగాన్ని బహ్రెయిన్ ఆరోగ్య నియంత్రణ విభాగం ఆమోదించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







