వీసాల జారీ ప్రక్రియ మళ్లీ షురూ
- November 07, 2021
కువైట్: కరోనా కారణంగా నిలిపివేసిన వీసాల జారీ ప్రక్రియను కువైట్ ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో మళ్లీ వీసాలు జారీ చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎంట్రీ వీసాలు, ఫ్యామిలీ యూనియన్ కు సంబంధించిన వీసాలకు గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని అంతర్గత వ్యవహారాల మినిస్ట్రీ తెలిపింది. అన్ని గవర్నేట్ ల పరిధిలో వీసా అప్లికేషన్స్ ను స్వీకరించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియల్ (MOI) వెబ్ సైట్ లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కువైట్ లో ఉద్యోగం చేస్తున్న వారికి సంబంధించి వారి పిల్లలు 16 ఏళ్ల లోపు వారైతే వారి పేరెంట్స్ తో ఉండేందుకు వీసాలు ఇవ్వనున్నారు. ఇక అన్ని కమర్షియల్, బిజినెస్ వీసాలతో పాటు హౌస్ హెల్పర్స్ కు సంబంధించిన వీసాలను కూడా గతంలో మాదిరిగానే ఇష్యూ చేస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐతే కువైట్ వీసా కోసం అప్లయ్ చేసే వారు కచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను సమర్పించాలని కండిషన్ పెట్టింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







