అల్ దఖిలియా లో విషాదం. చెరువులో పడి తండ్రి, కూతురు మృతి

- November 07, 2021 , by Maagulf
అల్ దఖిలియా లో విషాదం. చెరువులో పడి తండ్రి, కూతురు మృతి

మస్కట్: అల్ దఖిలియా గవర్నేట్ పరిధిలో విషాదం నెలకొంది. స్థానిక విలాయత్ లోయ సమీపంలోని వాడి చెరువులో పడి తండ్రి, కూతురు చనిపోయారు. చెరువులో మునిగిపోతున్న వారిని రెస్క్యూ అధికారులు గమనించి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వారిద్దరూ చనిపోయారు. చనిపోయిన వారిని గుర్తించాల్సి ఉంది.  "అల్ దఖిలియా గవర్నరేట్‌ పరిధిలోని విలాయత్‌ లోయ సమీపంలోని వాడి చెరువు లో తండ్రి, కూతురు మునిగిపోవటం గమనించి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ వారు బతకలేదు" సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. స్థానికులెవరు చెరువులో ఈతకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com