బర్త్‌డే కోసం రావొద్దు… అభిమానులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- November 07, 2021
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి యూత్‌లో బాగా ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా యువ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. ఈనెల 8న (సోమవారం) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నానని, అందువల్ల తాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు అందుబాటులో ఉండటం లేదని.. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

మరోవైపు తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, పూలదండలకు పెట్టే ఖర్చును అనాథలకు, పేదవారికి సహాయం చేయాలని అభిమాలనుకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అభిమానులు తనను వ్యక్తిగతంగా కలిసి చెప్పే శుభాకాంక్షలకన్నా ఈ పని తనకు ఎంతో సంతృప్తి ఇస్తుందని రేవంత్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







