భారీగా ట్రాఫిక్ ఉల్లంఘనలు...25 వేల మందికి పైగా నోటీసులు
- November 08, 2021
కువైట్: ట్రాఫిక్ నిబంధనల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహారిస్తున్నారు. ట్రాఫిక్ వాయిలేషన్స్ కు పాల్పడుతున్న వారిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాయిలేటర్స్... ట్రాఫిక్ అధికారులకు చిక్కుతున్నారు. గత వారం రోజుల్లోనే 25 వేల మందికి పైగాట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. అదే విధంగా జువైనల్స్ వెహికల్స్ వాడకం బాగా పెరిగిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాన్ని నడుపుతున్న 206 మంది మైనర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి పేరెంట్స్ ను పిలిచి పిల్లలకు వాహనాలను ఇవ్వొద్దని సూచించారు.మైనర్స్ కు వాహనాలు ఇవ్వటమంటే వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టటమేనని తల్లితండ్రులకు వివరించారు. మొత్తంగా వారం రోజుల్లోనే 25, 282 మందికి ట్రాఫిక్ వాయిలేషన్స్ నోటీసులు జారీ చేశారు. 25 వెహికల్స్ ను సీజ్ చేసి 8 మందిని అరెస్ట్ చేెశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







