లూలూ గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీకి ప్రీమదూత అవార్డు..!

- November 08, 2021 , by Maagulf
లూలూ గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీకి ప్రీమదూత అవార్డు..!

అబుధాబి: ప్రముఖ పారిశ్రామిక వేత్త, లూలూ గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీ.. ఇండోనేషియాలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ప్రీమదూత అవార్డును అందుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడి చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇండోనేషియా ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేసింది. కాగా.. యూసుఫ్ అలీ ఈ సందర్భంగా ఇండోనేషియా ప్రభుత్వానికి  ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇండోనేషియాలో మరిన్ని హైపర్ మార్కెట్లను ప్రారంభిస్తానన్నారు. ఈ-కామర్స్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని కూడా పేర్కొన్నారు. కాగా.. అబుధాబిలో ఎమిరేట్స్ ప్యాలెస్‌లో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com