ఎమిరేట్స్ రోడ్డు లో యాక్సిడెంట్. మూడు ఒంటెల మృతి
- November 08, 2021
యూఏఈ : కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మూడు ఒంటెలు చనిపోయిన ఘటన ఎమిరేట్స్ రోడ్ లో జరిగింది. మరో మూడు ఒంటెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఒంటెలు రోడ్డు దాటుతుండగా అరబ్ డ్రైవర్ ఒకరు కారుతో వేగంగా వాటిని ఢీకొట్టాడు. దీంతో స్పాట్ లోనే మూడు ఒంటెలు చనిపోయాయి. కారు డ్రైవర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. యాక్సిడెంట్ స్పాట్ కి పోలీసులు చేరుకునే లోపే అతను పరారయ్యాడు. డ్రైవింగ్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా వాహనాదారులు అన్ని సేప్టీ మెజర్స్ పాటించాలని ఈ సందర్భంగా పోలీసులు కోరారు. పొగమంచు దట్టంగా ఉందని...ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తుండగా మొబైల్ లో మాట్లాడటం చేయొద్దని, సీటు బెల్ట్ లేకుండా వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







