స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్
- November 08, 2021
న్యూ ఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే బ్యాంకింగ్, రీటైల్, ఈ కామర్స్‌తో పాటు వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈఎంఐ సదుపాయాన్ని స్పైస్ జెట్ ఇప్పుడు విమాన ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది.
విమాన ప్రయాణికులు ఈఎంఐ సౌకర్యంతో స్పైస్ జెట్ ఫ్లైట్ టికెట్లను కొనుగోలు చేయొచ్చు. 3,6,12 నెలల పాటు వాయిదా పద్దతుల్లో వడ్డీ లేకుండా, కొనుగోలు చేసిన టికెట్ల ధర మొత్తాన్ని ఈఎంఐలో చెల్లించుకోవచ్చు.
స్పైస్ జెట్ విమాన టికెట్లకు ఈఎంఐ సదుపాయం కావాలంటే ప్రయాణికులు పాన్ నెంబర్, ఆధార్ కార్డ్, వీఐడీ వివరాల్ని నమోదు చేయాలి. వన్‌టైమ్ పాస్వర్డ్ తో యాక్టీవ్ చేసుకోవాలి. వినియోగదారులు యూపీఐ ఐడీ ద్వారా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ స్కీమ్‌ను పొందేందుకు ప్రయాణికులు ఎలాంటి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను అందించాల్సిన అవసరం లేదని స్పైస్ జెట్ పేర్కొంది.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









