కీలకమైన ఎయిర్ ఫీల్డ్ నిర్వహణ పనుల్ని పూర్తి చేసిన బహ్రెయిన్ విమానాశ్రయం
- November 08, 2021
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద ఎయిర్ ఫీల్డ్ నిర్వహణ పనులు పూర్తయ్యాయని బహ్రెయిన్ ఎయిర్ పోర్టు కంపెనీ వెల్లడించింది. ఏడాదిలో రెండుసార్లు 20 రోజులపాటు ఈ నిర్వహణ పనులు చేస్తారు. సివిల్ మరియు ఎయిర్ ఫీల్డ్ లైటింగ్ వంటి విభాగాలకు సంబంధించిన నిర్వహణ పనులు చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు నిర్వహించే ఈ పనుల వల్ల ఎయిర్ పోర్టు కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా వుంటాయి. రన్ వేలు, ట్యాక్సీ వేలు, స్ట్రిప్ ప్రాంతాలు వంటివాటికి సంబంధించి నిర్వహణ జరుగుతుంటుంది. సివిల్ ఏవియేషన్ నిబంధనలకు అనుగుణంగా వీటిని నిర్వహిస్తారు. అస్ఫాల్ట్ ప్యాచ్ రిపెయిర్, రబ్బర్ తొలగింపు, పేవ్మెంట్ మార్కింగ్స్, జాయింట్ సీలింగ్, షోల్డర్ రిపెయిర్, స్ట్రిప్ గ్రేడింగ్, ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ మెయిన్టెనెన్స్, డ్రైనేజ్ లైన్ నిర్వహణ ఇతర ముఖ్యమైన పనలు ఇందులో భాగం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







