ICC T20: నమీబియాపై టీం ఇండియా ఘన విజయం
- November 08, 2021
దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ నమీబియా జట్టును భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. 133 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ 15.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి అలవోకగా విజయం సాధించింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా విసిరిన బంతులను ఎదురొడ్డలేక వికెట్లు సమర్పించుకున్నారు.
ఓపెనర్ మైఖేల్ వాన్ లింగెన్ (14)ను పెవిలియన్ పంపిన బుమ్రా 33 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత ఒక్క పరుగు జోడించి మరో ఓపెనర్ స్టెఫాన్ బార్డ్ (21) ఔటయ్యాడు. ఇది మొదలు నమీబియా వికెట్లు టపటపా రాలిపోయాయి. బ్యాటర్లు వచ్చినట్టే వచ్చి పెవిలియన్ చేరారు. భారత బౌలర్ల జోరు చూసి నమీబియా వంద పరుగులు చేయడం కూడా డౌటే అనుకున్నారు.
అయితే, డేవిడ్ వీజ్ క్రీజులో పాతుకుపోయి నిప్పులు చెరిగే బంతులను ఎదురొడ్డాడు. మొత్తంగా 25 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతో 26 పరుగులు చేయడంతో నమీబియా స్కోరు వంద పరుగులు దాటింది. జాన్ ఫ్రిలింక్ 20 పరుగులు చేయగా, చివరి ఓవర్‌లో రుబెన్ చెలరేగిపోయాడు. 6 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 13 పరుగులు చేయడంతో నమీబియా 132 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీసుకోగా, బుమ్రా రెండు వికెట్లు తీసుకున్నాడు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







