ప్రియురాలితో మాట్లాడినందుకు వార్నింగ్ ఇచ్చిన అమెజాన్ అధినేత
- November 10, 2021
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇటీవల హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియోను ఓ కార్యక్రమంలో కలిశారు. ఆ కార్యక్రమంలో తన ప్రియురాలు, డికాప్రియోకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో జెఫ్ బెజోస్ ట్విటర్ వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు.
అయితే ఇదంతా సరదాకే..
అసలు సంగతి ఏంటంటే.. గత శనివారం అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన లాక్మే ఆర్ట్+ఫిల్మ్ గాలా ఈవెంట్ కి అమెజాన్ అధినేత తన ప్రియురాలు లారెన్ సాంచెజ్‌తో కలిసి హాజరయ్యారు. అదే వేడుకకు డికాప్రియో కూడా వచ్చారు. ఆ కార్యక్రమంలో డికాప్రియో, లారెన్ సాంచెజ్ కాసేపు ఏదో విషయమై సంభాషించుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో పై బెజోస్ ఫన్నీగా స్పందిస్తూ ట్వీట్ చేశారు.

అందులో.. 'ప్రమాదం! ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతం' అని హెచ్చరిక బోర్డును పట్టుకొని చొక్కా లేకుండా తాను దిగిన ఓ ఫొటోను ఆ వీడియోకు జత చేస్తూ.. 'లియో ఇక్కడకు రా.. నీకొకటి చూపించాలి' అంటూ బెజోస్ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలయ్యింది. ఇప్పటికే దానిని 17 మిలియన్ల వ్యూస్ రాగా, 1.4 లక్షల లైకులు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







