నోబెల్ బహుమతి గ్రహీత మలాలా వివాహం
- November 10, 2021
బ్రిటన్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ వివాహ బంధంలో అడుగుపెట్టారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్‌లో గల తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగింది.
ఈ మేరకు 24 ఏళ్ల మలాలా తన భాగస్వామి అస్సర్‌తో కలిసి సామాజిక మాధ్యమాల వేదికగా ఈవిషయాన్ని పంచుకున్నారు. ''ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అస్సర్, నేను జీవిత భాగస్వాములు అయ్యాం. బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మీ ఆశీస్సులు మాకు అందించండి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం'' అని మలాలా ట్వీట్ చేశారు. తన భర్త అస్సర్‌తో దిగిన ఫొటోలను పంచుకున్నారు.

పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో జన్మించిన మలాలా బాలికల విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు. దీంతో 2012లో తాలిబన్లు పాఠశాల బస్సులోకి చొరబడి ఆమెపై కాల్పులకు దిగారు. మలాలా ఎడమ కణతిపై, శరీరంపై తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆమెను వెంటనే పెషావర్‌కు తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. అయితే బుల్లెట్ గాయాలకారణంగా ఉత్తమ చికిత్స కోసం బ్రిటన్‌కు తరలించారు. పలు శస్త్రచికిత్సల తర్వాత మలాలా కోలుకున్నారు. అనంతరం బ్రిటన్‌లోనే తల్లిదండ్రులతో కలిసి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.

ఇక అప్పటి నుంచి మలాలా బాలికల విద్య కోసం పోరాడుతూనే ఉన్నారు. మలాలా ఫండ్ పేరుతో బాలికల విద్యకోసం ఛారిటీ సంస్థను నెలకొల్పారు. ఈ క్రమంలో తన సేవలను గుర్తించిన నోబెల్ కమిటీ 2014లో మలాలాకు నోబెల్ శాంతి బహుమతిని అందించింది. దీంతో 17 ఏళ్ల అతిపిన్న వయస్కురాలిగా నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా మాలాలా వార్తల్లో నిలిచారు. 2020లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







