60 ఏండ్లకుపైబడ్డ వారికి వర్క్ పర్మిట్లు, ఇన్సూరెన్స్.. రెండ్రోజుల్లో నిర్ణయం..!
- November 12, 2021
కువైట్: 60 ఏండ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి వర్క్ పర్మిట్ల పునరుద్ధరణపై నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) పేర్కొంది. కేవలం హైస్కూల్ సర్టిఫికేట్లు మాత్రమే కలిగి ఉన్నవారికి వర్క్ పర్మిట్ల పునరుద్ధరణపై మాత్రమే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని PAM తెలిపింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రి డాక్టర్ అబ్దుల్లా అల్-సల్మాన్ అధ్యక్షతన ఉన్న PAM డైరెక్టర్ల బోర్డు ఆమోదం పొందిన వెంటనే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని అల్-అన్బా దినపత్రిక తన కథనంలో పేర్కొంది. 60 ఏండ్లు పైడిన వారికి వర్క్ పర్మిట్ల జారీ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ మెకానిజం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మూడు రకాల ఇన్సూరెన్స్ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రతి కేటగిరీకి నిర్దిష్ట రుసుములతోపాటు షరతులు ఉంటాయని తెలుస్తోంది. వచ్చే వారం రోజుల్లో వీటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయబడుతుందని అల్-అన్బా తెలిపింది. హెల్త్ ఇన్సూరెన్స్ ను పొందిన తర్వాత లావాదేవీని ఆటోమేటిక్ రెన్యూవల్ కోసం అథారిటీ ఇ-సర్వీసెస్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ రుసుములకు సంబంధించి త్వరలోనే విధి విధానాలు ఖరారు కానున్నాయి. యూనివర్సిటీ డిగ్రీ హోల్డర్‌లతో సహా 60 ఏళ్లు దాటిన వారందరినీ పరిగణనలోకి తీసుకున్నా.. ప్రస్తుతానికి హైస్కూల్ సర్టిఫికేట్ హోల్డర్‌లకు మాత్రమే పీఏఎమ్ పరిశీలన చేస్తుందని అని వార్తా పత్రిక తన కథనంలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







